ఖారా బాత్‌

ABN , First Publish Date - 2019-08-17T17:32:07+05:30 IST

బొంబాయి రవ్వ - అరకప్పు, నూనె - ఐదు టీస్పూన్‌లు, ఆవాలు - అర టీస్పూన్‌, జీలకర్ర - అరటీస్పూన్‌, సెనగపప్పు - అర టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌,

ఖారా బాత్‌

కావలసినవి
 
బొంబాయి రవ్వ - అరకప్పు, నూనె - ఐదు టీస్పూన్‌లు, ఆవాలు - అర టీస్పూన్‌, జీలకర్ర - అరటీస్పూన్‌, సెనగపప్పు - అర టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌, కరివేపాకు - ఒకకట్ట, జీడిపప్పు - పది పలుకులు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, అల్లం - చిన్నముక్క, టొమాటో - ఒకటి, బీన్స్‌ - పావు కప్పు, పచ్చిబఠాణీ - పావుకప్పు, పసుపు - చిటికెడు, వాంగీ బాత్‌ పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నెయ్యి - ఒక టీస్పూన్‌, కొత్తిమీర - ఒకకట్ట.
 
తయారీవిధానం
 
ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటమన్న తరవాఆత జీలకర్ర, సెనగపప్పు, మినపప్పు వేసి వేగించాలి. కాసేపయ్యాక కరివేపాకు, జీడిపప్పు పలుకులు వేసి మరికాసేపు వేగించాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి. పచ్చిమిర్చి, దంచిన అల్లం వేసి వేగించాలి. తరువాత టొమాటో ముక్కలు వేసుకోవాలి. బీన్స్‌, పచ్చిబఠాణీలు వేసి మరికొద్దిసేపు చిన్నమంటపై ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు నీళ్లు పోయాలి. రవ్వ ఒక గ్లాసు ఉంటే నీళ్లు రెండు గ్లాసులు పోయాలి. నీళ్లు మరగుతున్న సమయంలో పసుపు, వాంగీబాత్‌ పొడి, ఉప్పు వేసి కలియబెట్టాలి. మంట చిన్నగా పెట్టుకుని రవ్వ నెమ్మదిగా పోస్తూ కలుపుకోవాలి. రవ్వ ఉడికిన తరువాత నెయ్యి వేసి, కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి.

Updated Date - 2019-08-17T17:32:07+05:30 IST