గ్రీన్ పీస్ నిమోన

ABN , First Publish Date - 2019-07-13T20:32:32+05:30 IST

పచ్చి బఠాణీ - ఒక కేజీ, బంగాళదుంపలు - రెండు, ఉల్లిపాయలు - నాలుగు, ఇంగువ - చిటికెడు, అల్లం

గ్రీన్ పీస్ నిమోన

కావలసినవి
 
పచ్చి బఠాణీ - ఒక కేజీ, బంగాళదుంపలు - రెండు, ఉల్లిపాయలు - నాలుగు, ఇంగువ - చిటికెడు, అల్లం - ఒక ముక్క, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, బిర్యానీ ఆకులు - రెండు, ధనియాల పొడి - ఒక టేబుల్‌ స్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌; పసుపు - అర టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, లవంగాలు - ఐదు, యాలకులు - ఐదు, దాల్చిన చెక్క - చిన్నముక్క, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - తగినంత, టొమాటో ప్యూరీ - మూడు టేబుల్‌ స్పూన్లు, నూనె - సరిపడా, నెయ్యి - ఒక టేబుల్‌ స్పూన్‌.
 
తయారీవిధానం
 
పచ్చిబఠాణీలో సగం మెత్తగా గ్రైండ్‌ చేయాలి. మిగతా సగం కొద్దిగా కచ్చాపచ్చా ఉండేలా గ్రైండ్‌ చేయాలి. అల్లం, వెల్లుల్లి, లవంగాలు, దాల్చినచెక్క, జీలకర్ర, యాలకులను పేస్టు మాదిరిగా చేసుకొని పక్కన పెట్టాలి. ఉల్లిపాయలను పేస్టు మాదిరిగా చేసుకోవాలి.
బంగాళదుంపను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి ఉల్లిపాయలు, బంగాళదుంప ముక్కలు వేసి వేగించాలి. అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ పేస్టు, కొత్తిమీర, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి మరికాసేపు వేగించి పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్‌లో నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక ఇంగువ వేయాలి. తరువాత మెత్తగా గ్రైండ్‌ చేసుకున్న బఠాణీ మిశ్రమం వేయాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం, టొమాటో ప్యూరీ వేసి మరికాసేవు వేగించాలి. కచ్చా, పచ్చాగా గ్రైండ్‌ చేసుకున్న బఠాణీలు వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి, గరంమసాలా వేయాలి. చిన్న మంటపై ఉడికించుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని, అన్నంతో గానీ, చపాతీతో గానీ తింటే రుచిగా ఉంటుంది.

Updated Date - 2019-07-13T20:32:32+05:30 IST