చింత చిగురు పచ్చి రొయ్యల కర్రీ

ABN , First Publish Date - 2019-05-04T19:53:05+05:30 IST

పచ్చి రొయ్యలు - అరకేజీ, చింతచిగురు - పావుకేజీ, ఉల్లిపాయలు - రెండు, పచ్చి మిర్చి - నాలుగు...

చింత చిగురు పచ్చి రొయ్యల కర్రీ

కావలసిన పదార్థాలు
 
పచ్చి రొయ్యలు - అరకేజీ, చింతచిగురు - పావుకేజీ, ఉల్లిపాయలు - రెండు, పచ్చి మిర్చి - నాలుగు, నూనె - మూడు టీస్పూన్లు, పసుపు - టీస్పూన్‌, కారం - టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారుచేయు విధానం
 
ముందుగా పచ్చి రొయ్యలను శుభ్రం చేసి కడిగి పెట్టుకోవాలి. చింతచిగురును పేస్టు మాదిరిగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రను తీసుకొని కాస్త నూనె వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించుకోవాలి. తరువాత పచ్చిమిర్చి వేసి మరికాసేపు వేగించుకోవాలి. కాసేపయ్యాక పచ్చి రొయ్యలు వేసి, కొద్దిగా పసుపు వేసి ఉడికించాలి. పదినిమిషాల తరువాత చింతచిగురు వేయాలి. కారం, ఉప్పు వేసి మరి కాసేపు ఉడికించుకోవాలి. చివరగా గ్లాసు నీళ్లు పోసి కాసేపు ఉడికించి, దింపుకోవాలి.

Updated Date - 2019-05-04T19:53:05+05:30 IST