అరికల కేక్‌

ABN , First Publish Date - 2019-02-23T22:38:41+05:30 IST

అరికల పిండి - 100 గ్రా., వెన్న - 75 గ్రా., పంచదార పొడి - 75 గ్రా., గుడ్లు (2) - 100 గ్రా...

అరికల కేక్‌

కావలసిన పదార్థాలు: అరికల పిండి - 100 గ్రా., వెన్న - 75 గ్రా., పంచదార పొడి - 75 గ్రా., గుడ్లు (2) - 100 గ్రా.
 
తయారీ విధానం: అరికల పిండిలో బేకింగ్‌ పౌడర్‌ వేసి జల్లించుకోవాలి. గుడ్డులోని తెల్లసొనని, పచ్చసొనని వేరుగా బీట్‌ చేసుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్‌ బౌల్‌లో పంచదార పొడి, వెన్న రెండింటిని బాగా కలుపుకోవాలి. దీనికి వేరు వేరుగా బీట్‌ చేసుకున్న గుడ్డుని కలపాలి. తర్వాత సామలపిండిని కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని గ్రీస్‌ చేసుకున్న బేకింగ్‌ మౌల్డ్‌లో వేసుకోవాలి. ముందుగా 160 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద 15 నిమిషాలు వేడి చేసుకున్న ఒవెన్‌లో ఉంచి 190 డిగ్రీల సెం.గ్రే. వద్ద 25 నిమిషాలు వేడి చేసుకోవాలి.
పోషక విలువలు : 100 గ్రాముల ఈ పదార్థంలో శక్తి 379.21 కి.కెలోరీలు, ప్రొటీన్‌ 6.19 గ్రా., కొవ్వు 21.55 గ్రా., కాల్షియం 27.42 మి.గ్రా., భాస్వరం 116.7 మి.గ్రా., ఇనుము 0.77 మి.గ్రా.

Updated Date - 2019-02-23T22:38:41+05:30 IST