ఉసిరి మురబ్బా

ABN , First Publish Date - 2018-12-01T23:54:20+05:30 IST

ఉసిరికాయలు - 10, పంచదార - ఒక కప్పు, నీరు - ఒక కప్పు, లవంగాలు - 2, దాల్చినచెక్క..

ఉసిరి మురబ్బా

కావలసిన పదార్థాలు
 
ఉసిరికాయలు - 10, పంచదార - ఒక కప్పు, నీరు - ఒక కప్పు, లవంగాలు - 2, దాల్చినచెక్క - అంగుళం ముక్క, మిరియాలు - 5, నల్ల ఉప్పు - చిటికెడు, కుంకుమపువ్వు - 4 రెమ్మలు.
 
తయారుచేసే విధానం
 
తగినంత నీటిలో ఉసిరికాయలు ఉడికించి గింజలు తీసేయాలి. ఇప్పుడొక పాన్‌లో ఒక కప్పు నీరు, పంచదారతో పాటుగా లవంగాలు, దాల్చన చెక్క, మిరియాలు వేసి చిన్నమంటపై 30 నిమిషాలు ఉడికించాలి. తర్వాత దించేసి 2 రోజుల పాటు పక్కనుంచాలి. తర్వాత మరోసారి వేడి చేసి చిక్కబడ్డాక ఉప్పు, కుంకుమపువ్వు కలిపి మరో పది నిమిషాలు ఉడికించి మంట తీసెయ్యాలి. చల్లారిన తర్వాత సీసాలో వేసి మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే కనీసం 6 నెలల పాటు నిలువ ఉంటుంది. ఒక్కొక్క రెబ్బను చప్పరిస్తే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-12-01T23:54:20+05:30 IST