Abn logo

ఆమ్లా సబ్జీ

కావలసినవి
 
ఉసిరికాయ ముక్కలు (గింజలు తీసేసి) - ఒక కప్పు, ఆవనూనె - అర టేబుల్‌ స్పూను, పచ్చిమిర్చి - రెండు (నిలువుగా తరిగి), కారం, జీలకర్ర - ఒక్కొక్కటీ ఒక్కో అర టీస్పూను, పసుపు -పావు టీస్పూను, సోంపు - అర టీస్పూను (కచ్చాపచ్చాగా పొడిచేసి), ధనియాలు - ఒక టీస్పూను (కచ్చాపచ్చాగా పొడిచేసి), ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి సరిపడా, బెల్లం తరుగు - ఒక టేబుల్‌స్పూను. కూరపై చల్లడానికి - కొత్తిమీర తరుగు కొద్దిగా.
 
తయారీవిధానం
 
నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేడిచేసి పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఆవాలు వేసి సన్నని మంటపై దోరగా వేగించాలి. అందులో ఆమ్లా ముక్కలు వేసి సన్నని మంటపై మూడు నిమిషాలు ఉడికించాలి. ఉడికే క్రమంలో ఈ ముక్కల్ని మధ్య మధ్యలో కలపాలి.
ఆ మిశ్రమంలో కారం, పసుపు, సోంపు, ధనియాల పొడులు, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలిపి ఒక నిమిషం ఉడికించాలి. తర్వాత అరకప్పు నీళ్లు, రెడీగా పెట్టుకున్న బెల్లం తరుగు వేసి బాగా కలిపి మూత పెట్టి నాలుగు నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో ఈ మిశ్రమాన్ని గరిటెతో కలపాలి. కూర దగ్గర పడిన తర్వాత దించి దానిపై కొత్తిమీర తరుగు చల్లి వేడి వేడి అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

మిడతల దండు ముప్పు తప్పినట్లేనా?పదికి సిద్ధంరైతులు ఆందోళన చెందవద్దు: మిడతల రాష్ట్ర పరిశీలన బృందంబాసర ట్రిపుల్‌ ఐటీలో అగ్ని ప్రమాదంఅకాల వర్షం.. తడిసిన ధాన్యంరోడ్ల నిర్మాణానికి ప్రత్యేక చర్యలుపౌల్ట్రీ పల్టీ !హైలేవల్‌ కాలువలపై మరోసారి కదలిక కలెక్టరేట్‌ ఎదుట రేషన్‌ డీలర్ల ధర్నాప్రభుత్వ ఆదేశాల మేరకు ఆవిర్భావ వేడుకలు
Advertisement
d_article_rhs_ad_1
Advertisement