కందారి గోష్‌

ABN , First Publish Date - 2018-11-10T21:29:04+05:30 IST

మటన్‌ - 750 గ్రా., దానిమ్మ రసం - 300 గ్రా., నూనె - అరకప్పు, ఉల్లి తరుగు - 350 గ్రా., వెల్లుల్లి రేకలు...

కందారి గోష్‌

కావలసిన పదార్థాలు
 
మటన్‌ - 750 గ్రా., దానిమ్మ రసం - 300 గ్రా., నూనె - అరకప్పు, ఉల్లి తరుగు - 350 గ్రా., వెల్లుల్లి రేకలు - 14, అల్లం - అంగుళం ముక్క, పెరుగు - 100 గ్రా., జీడిపప్పు - 50 గ్రా., బాదం - 25 గ్రా., కిస్‌మిస్‌ - 25 గ్రా., నెయ్యి - 50 గ్రా., ఉప్పు - సరిపడా, పంచదార - 2 టీ స్పూన్లు, పసుపు - 2 టీ స్పూన్లు, ధనియాల పొడి - 3 టీ స్పూన్లు, కశ్మీరీ కారం - 2 టీ స్పూన్లు, దాల్చినచెక్క+యాలకుల పొడి - ఒక టీ స్పూను; మసాల దినుసులు: యాలకులు - 6, జాజికాయ పొడి - అర టీ స్పూను, షాజీరా - ఒక టీ స్పూను, మిరియాలు - 20, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, లవంగాలు - 6, బిర్యాని ఆకులు - 2.
 
తయారుచేసే విధానం
ముందుగా మటన్‌లో దానిమ్మరసం, స్పూను ఉప్పు వేసి బాగా కలిపి 2 గంటలపాటు పక్కనుంచాలి. ఇప్పుడు కడాయిలో 8 స్పూన్లు నూనె వేసి మసాల దినుసులతో పాటు అల్లం పేస్టు, దంచిన వెల్లుల్లి వేయాలి. తర్వాత ఉల్లి తరుగు వేగించి పంచదార కలపాలి. పక్కనుంచిన మటన్‌ వేసి మంట పెద్దగా చేసి కారం, పసుపు, ధనియాల పొడి చల్లాలి. మటన్‌ దోరగా వేగిన తర్వాత వంద గ్రా. నీరు పోసి సరిపోయే ఉప్పు వేసి
ఉడికించాలి. నీరంతా ఇగిరిపోయాక మరో 50 గ్రా. వేడి నీరు పోసి మూతపెట్టాలి. మటన్‌ మెత్తగా ఉడికే వరకు వేడి నీరు కొద్ది కొద్దిగా పోస్తూ ఉండాలి. చివర్లో గిలకొట్టిన పెరుగు వేసి బాగా కలిపి జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌ వేసి, యాలకులు, దాల్చిన చెక్క పొడి చల్లి
దించేయాలి.

Updated Date - 2018-11-10T21:29:04+05:30 IST