సమ్మర్‌ సలాడ్‌

ABN , First Publish Date - 2018-06-05T20:01:09+05:30 IST

వేసవిలో కోల్పోయే ఖనిజ లవణాలు, విటమిన్లను భర్తీ చేయాలంటే వాటిని కలిగి ఉండే పళ్లు...

సమ్మర్‌ సలాడ్‌

వేసవిలో కోల్పోయే ఖనిజ లవణాలు, విటమిన్లను భర్తీ చేయాలంటే వాటిని కలిగి ఉండే పళ్లు, కూరగాయలను తీసుకోవాలి. ఈ కాలంలో తప్పనిసరిగా రోజుకు రెండు సార్లైనా సలాడ్లు తినాలి. ఈసారికి ఇదిగో ఈ ఈజీ సలాడ్‌ ట్రై చేయండి.
 
కావలసిన పదార్థాలు
పుచ్చకాయ ముక్కలు - 3 కప్పులు
కీరా ముక్కలు - 3 కప్పులు
పుదీనా ఆకులు - 8
నిమ్మరసం - 3 టేబుల్‌ స్పూన్లు
తగినంత ఉప్పు, మిరియాల పొడి - తగినంత
 
తయారీ విధానం
వెడల్పాటి గిన్నెలో పుచ్చకాయ ముక్కలు, కీరా ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, పుదీనా తరుగు వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన వెంటనే తినేయాలి.
ఒకవేళ తర్వాత తినాలనుకుంటే ఉప్పు కలపకుండా, మూత ఉంచి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేస్తే 4 గంటలపాటు సలాడ్‌ పాడవకుండా ఉంటుంది. తినే ముందు ఉప్పు కలుపుకోవాలి.

Updated Date - 2018-06-05T20:01:09+05:30 IST