మామిడి ఫ్రెంచ్‌ టోస్ట్‌

ABN , First Publish Date - 2018-05-19T19:08:53+05:30 IST

పెద్ద మామిడిపండు-ఒకటి (ముక్కలుగా కట్‌ చేసి), ఐసింగ్‌ షుగర్‌-రెండు టేబుల్‌స్పూన్లు...

మామిడి ఫ్రెంచ్‌ టోస్ట్‌

కావలసినవి
 
పెద్ద మామిడిపండు-ఒకటి (ముక్కలుగా కట్‌ చేసి), ఐసింగ్‌ షుగర్‌-రెండు టేబుల్‌స్పూన్లు, ఫ్రెంచి బ్రెడ్‌- మూడు స్లైసులు, పెద్ద ఎగ్స్‌-మూడు (గిలక్కొట్టి), పాలు-అర కప్పు, కమలాపండురసం- పావు కప్పు, దాల్చినచెక్క పొడి- అర టీస్పూను, జాజికాయపొడి-1/8 టీస్పూను, వెన్న- మూడు టేబుల్‌స్పూన్లు.
 
తయారీవిధానం
 
ఒక పాత్రలో మామిడిపళ్లముక్కలు, ఐసింగ్‌ షుగర్‌ వేసి బాగా కలపాలి. బ్రె డ్‌ ముక్కకు ఒక వైపు నైఫ్‌తో సంచిలా సన్నటి కట్‌ చేయాలి. ఇలానే అన్ని బ్రెడ్‌ ముక్కలనూ కట్‌ చేయాలి. బ్రెడ్‌కు ఒక వైపు సన్నగా సంచిలా కట్‌ చేసిన దాంట్లో మూడు మామిడిపండు ముక్కలను జాగ్రత్తగా పెట్టాలి. బ్రెడ్‌ ముక్కలు అన్నింటిలో ఇలానే మామిడి పండు ముక్కలను పెట్టాలి. ఈ బ్రెడ్‌ స్లైసె్‌సను బేకింగ్‌ షీట్‌పై పెట్టాలి. ఇంకో పెద్ద పాత్రలో గిలక్కొట్టిన ఎగ్‌ మిశ్రమం, కమలాపండు జ్యూసు, పాలు, మసాలాలను వేసి బాగా కలపాలి. ఎలక్ర్టానిక్‌ గ్రిడిల్‌ను లేదా పెద్ద స్కిల్లెట్‌ను మీడియం నుంచి మీడియం హై హీట్‌లో పెట్టాలి. దానిపై వెన్న కరిగించి స్కిల్లెట్‌ అంతటికీ వెన్న పట్టేలా చూడాలి.
సిద్ధం చేసుకున్న ఎగ్‌ మిశ్రమంలో బ్రెడ్‌ ముక్కలను ముంచాలి. ఇలా ఒక్కొక్క బ్రెడ్‌ ముక్కను బంగారు వర్ణంలోకి వచ్చేదాకా కాల్చాలి. ఇలా అన్ని బ్రెడ్‌ ముక్కలను కాల్చిన తర్వాత ప్లేటులో చక్కగా అమర్చాలి. కాఫీ, టీ లేదా సాస్‌తో కలిపి దీన్ని బ్రేక్‌ఫా్‌స్టగా తినొచ్చు.

Updated Date - 2018-05-19T19:08:53+05:30 IST