సబ్జా గింజలతో మెలాన్ గ్రీన్ జ్యూస్
v id="pastingspan1">
కావలసినవి
కీరదోసకాయ - ఒకటి, పాలకూర - మూడు కట్టలు(పెద్ద గుప్పెడు), పుదీనా ఆకులు (ఇష్టపడితే) - గుప్పెడు, కర్బూజ ముక్కలు - అరకప్పు, పుచ్చకాయ ముక్కలు - అరకప్పు, సముద్రపు ఉప్పు - 1/8 టీస్పూన్, సబ్జా గింజలు - పావుకప్పు (నీళ్లలో రాత్రి నానబెట్టాలి. తెల్లవారి వడకట్టాలి. వీటిని కూడా ఇష్టపడితేనే వాడండి.)
తయారీవిధానం
కీరదోసకాయ, పాలకూర, పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడగాలి. ఉప్పు, సబ్జా గింజలు తప్ప మిగతా అన్నింటినీ జ్యూసర్‌లో వేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన జ్యూస్ మీద ఉప్పు, సబ్జాగింజలు వేసి కలపాలి. ఈ జ్యూస్ తాగితే ఎంతటి ఎండలో అయినా డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండొచ్చు.