క్యాబేజ్‌ అండ్‌ క్యారెట్‌ డబుల్‌ డెక్కర్‌

ABN , First Publish Date - 2016-06-06T19:35:45+05:30 IST

కావలసిన పదార్థాలు: హోల్‌వీట్‌ బ్రెడ్‌ స్లయిసెస్‌ - 12, బటర్‌ - 3, టీస్పూన్లు స్టఫింగ్‌ కోసం: క్యాబేజి తురుము - 1 1/2 కప్పు , క్యారెట్‌ తురుము - 1 కప్పు , పనీర్‌ తురుము - అర కప్పు , కొత్తిమీర తరుగు - పావు కప్పు , సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 1 టీస్పూను , ఉప్పు - రుచికి సరిపడా.

క్యాబేజ్‌ అండ్‌ క్యారెట్‌ డబుల్‌ డెక్కర్‌

కావలసిన పదార్థాలు: హోల్‌వీట్‌ బ్రెడ్‌ స్లయిసెస్‌ - 12, బటర్‌ - 3, టీస్పూన్లు
స్టఫింగ్‌ కోసం: క్యాబేజి తురుము - 1 1/2 కప్పు , క్యారెట్‌ తురుము - 1 కప్పు , పనీర్‌ తురుము - అర కప్పు , కొత్తిమీర తరుగు - పావు కప్పు , సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 1 టీస్పూను , ఉప్పు - రుచికి సరిపడా.
 
తయారీ విధానం: స్టఫింగ్‌ కోసం తయారుచేసిన పదార్థాలన్నీ కలిపి 8 సమభాగాలుగా విడదీసి పెట్టుకోవాలి. బటర్‌ స్లయిసెస్‌‌కు రెండు వైపులా పూసి పెనం మీద రెండు వైపులా గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌ వచ్చేవరకూ కాల్చుకోవాలి. ఒక స్లయి్‌సను చదునైన ప్లేట్‌ మీద ఉంచి స్టఫింగ్‌ సమంగా పరిచి టోస్ట్‌ చేసిన మరో స్లయి్‌సను పైన ఉంచాలి. దాని పైన మళ్లీ స్టఫింగ్‌ పరిచి ఇంకో స్లయి్‌సను పైన ఉంచాలి. మిగతా స్లయిసె్‌సలతో కూడా ఇలాంటి డబుల్‌ డెక్కర్‌ శాండ్‌విచ్‌లు తయారుచేసుకోవాలి. పదునైన కత్తితో శాండ్‌విచ్‌లను క్రాస్‌గా కట్‌ చేసి సర్వ్‌ చేయాలి.
(తయారీకి పట్టే సమయం: 10 నిమిషాలు)

Updated Date - 2016-06-06T19:35:45+05:30 IST