గుమ్మడి బ్రెడ్

ABN , First Publish Date - 2016-05-18T14:26:10+05:30 IST

కావలసిన పదార్ధాలు: గుమ్మడికాయ గుజ్జు- రెండు కప్పులు, పంచదార - మూడు కప్పులు, కోడిగుడ్లు- నాలుగు, మైదాపిండి - మూడు కప్పులు, బేకింగ్‌ పౌడర్‌- రెండు టీ స్పూన్లు, బేకింగ్‌ సోడా- ఒక టీ

గుమ్మడి బ్రెడ్

కావలసిన పదార్ధాలు: గుమ్మడికాయ గుజ్జు- రెండు కప్పులు, పంచదార - మూడు కప్పులు, కోడిగుడ్లు- నాలుగు, మైదాపిండి - మూడు కప్పులు, బేకింగ్‌ పౌడర్‌- రెండు టీ స్పూన్లు, బేకింగ్‌ సోడా- ఒక టీ స్పూన, దాల్చినచెక్క పొడి - అర టీ స్పూన, లవంగాల పొడి - పావు టీ స్పూన, వాల్‌నట్‌ ముక్కలు - ఒక కప్పు, కిస్మి్‌సలు - ఒక కప్పు, ఉప్పు - కొద్దిగా, నీళ్ళు - ఒక కప్పు .
 
తయారీ: ముందుగా కోడిగుడ్ల సొనని బాగా గిలక్కొట్టాలి. అందులో పంచదారపొడి, మైదాపిండి, నీళ్ళు పోసి బాగా కలిసేటట్టు గిలక్కొట్టాలి. ఇందులో బేకింగ్‌ సోడా, బేకింగ్‌ పౌడర్‌, దాల్చినచెక్క పొడి, లవంగాల పొడి, వాల్‌నట్‌ ముక్కలు, కిస్మిస్‌లు వేసి బాగా కలపాలి. బాగా లోతుగా ఉండే గిన్నెలో వేసి ఒవెనలో బేక్‌ చేయాలి. చల్లారిన తర్వాత బ్రెడ్‌ ముక్కల్లా కోసుకోవాలి.

Updated Date - 2016-05-18T14:26:10+05:30 IST