బఠాణీ బాత్‌ సలాడ్‌

ABN , First Publish Date - 2015-11-10T14:31:22+05:30 IST

కావలసిన పదార్థాలు : పచ్చి బఠాణీ-అర కప్పు, అన్నం-పావు కప్పు, పచ్చికొబ్బరి తురుము-పావు కప్పు, పచ్చిమిర్చి-2,

బఠాణీ బాత్‌ సలాడ్‌

కావలసిన పదార్థాలు : పచ్చి బఠాణీ-అర కప్పు, అన్నం-పావు కప్పు, పచ్చికొబ్బరి తురుము-పావు కప్పు, పచ్చిమిర్చి-2, నిమ్మకాయ-1, టమాట-1, కొత్తిమీర-కొద్దిగా, ఉప్పు-రుచికి సరిపడా.
తయారుచేసే విధానం : ముందుగా బఠాణీలను ఉడికించాలి. ఒక గిన్నెలో అన్నం తీసుకుని అందులో బఠాణీలు, పచ్చికొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. టమాట, పచ్చిమిర్చిని సన్నగా తరిగి దీనికి చేర్చాలి. తరువాత నిమ్మరసం పిండి, తగినంత ఉప్పు చేర్చి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్లేటులోకి తీసుకుని పైన కొత్తిమీరతో అలంకరించాలి.

Updated Date - 2015-11-10T14:31:22+05:30 IST