దోసకాయ చింతకాయ పచ్చడి

ABN , First Publish Date - 2015-09-01T22:16:00+05:30 IST

కావలసిన పదార్థాలు: దోసముక్కలు - 2 కప్పులు, లేత చింతకాయలు - 6, పచ్చిమిర్చి - 4, కొత్తిమీర తరుగు

దోసకాయ చింతకాయ పచ్చడి

కావలసిన పదార్థాలు: దోసముక్కలు - 2 కప్పులు, లేత చింతకాయలు - 6, పచ్చిమిర్చి - 4, కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను, వేగించిన పల్లీలు - 1 టేబుల్‌ స్పూను, పసుపు - పావు టీ స్పూను, వెల్లుల్లి - 2 రేకలు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: కడాయిలో నూనె వేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి రేకలు, పసుపు, కొత్తిమీర తరుగు వేగించాలి. వీటితో వేరుశనగపప్పు, చిదిమిన చింతకాయలు, ఉప్పు జతచేసి మెత్తగా గ్రైండు చేసి, చివర్లో దోసముక్కలు వేసి ఒక తిప్పు తిప్పి తీసేయాలి. ఈ చట్నీ పుల్లపుల్లగా కొత్త రుచితో అన్నంలోకి బాగుంటుంది. 

Updated Date - 2015-09-01T22:16:00+05:30 IST