Abn logo

ఎగ్‌ వెజిటెబుల్‌ ఆమ్లెట్‌

కావ

లసిన పదార్థాలు: గుడ్లు - 3, ఉల్లిపాయ - 1, ఉల్లికాడ - 1, టమోటా - 1, పచ్చిమిర్చి, క్యారెట్‌ తరుగు - 2 టీ స్పూన్ల చొప్పున, క్యాప్సికం, క్యాబేజి తరుగు - 1 టీ స్పూను చొప్పున, సోయ సాస్‌, గ్రీన్‌ చిల్లీ సాస్‌ - 1 టీ స్పూను చొప్పున, పసుపు - అర టీ స్పూను, మిరియాల పొడి - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం : ఉల్లిపాయ, టమోటా చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఉల్లికాడ కట్‌ చేసి తెలుపు, ఆకుపచ్చలను విడిగా పెట్టుకోవాలి. ఒక పాత్రలో ఉల్లి, టమోటా, క్యారెట్‌, క్యాబేజి, క్యాప్సికం, ఉల్లికాడ (తెల్ల) తరుగు, మిరియాలపొడి వేసి బాగా కలపాలి. మరో పాత్రలో గుడ్లు, పసుపు, ఉప్పు, రెండు టేబుల్‌ స్పూన్లు నీరు, సోయ, చిల్లీ సాస్‌, మిరియాల పొడి వేసి నురగ వచ్చేలా గిలకొట్టాలి. నూనె రాసిన పెనంపై గుడ్ల మిశ్రమం పోసి దోశలా నెరిపి మంట తగ్గించాలి. ఇప్పుడు కూరగాయల తరుగు చల్లి, అర టీ స్పూను నూనె కూడా చిలకరించి మూత పెట్టాలి. తర్వాత రెండో వైపు కూడా దోరగా కాల్చుకోవాలి. ఈ ఆమ్లెట్‌ అన్నంతో నంజుకోవచ్చు లేదా స్నాక్స్‌గా తీసుకోవచ్చు.

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలివైభవంగా లక్ష దీపోత్సవంకోతుల నియంత్రణేది ? ఒమైక్రాన్‌ రాకుండా జాగ్రత్త వహించాలివ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలివాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి శాంతి భద్రతల పరిరక్షణకే నిర్బంధ తనిఖీలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న పాలకులు ఫీడింగ్‌ చాంబర్‌కు జాతీయస్థాయి అవార్డు దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి
Advertisement