పుదీనా చికెన్‌

ABN , First Publish Date - 2015-09-01T16:49:58+05:30 IST

కావలసిన పదార్థాలు: చికెన్‌ - 700 గ్రా., పుదీనా ఆకులు - 1 కప్పు, చిక్కటి పెరుగు - ఒకటిన్నర కప్పు

పుదీనా చికెన్‌

కావలసిన పదార్థాలు: చికెన్‌ - 700 గ్రా., పుదీనా ఆకులు - 1 కప్పు, చిక్కటి పెరుగు - ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయలు - 2, అల్లంవెల్లుల్లి పేస్టు - 1 టేబుల్‌ స్పూను, టమోటా గుజ్జు - 1 కప్పు, పచ్చిమిర్చి - 2, నిమ్మరసం - 1 టేబుల్‌ స్పూను, జీలకర్ర - ఒకటిన్నర స్పూను, దాల్చినచెక్క - అంగుళం ముక్క, యాలక్కాయ - 1, కారం - 1 టీ స్పూను, మిరియాల పొడి, దనియాల పొడి, గరం మసాల పొడి - 1 టీ స్పూను చొప్పున, నూనె - 3 టేబుల్‌ స్పూన్లు, పాలు (చిక్కదనం కోసం) - అరకప్పు
తయారుచేసే విధానం: చికెన్‌ ముక్కలకు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, గరం మసాల, నిమ్మరసం పట్టించి, మూత పెట్టి రిఫ్రిజిరేటర్‌లో 2 గంటలు ఉంచాలి. నూనెలో జీలకర్ర, దాల్చిన చెక్క, యాలక్కాయ, ఉల్లి తరుగు వేగించి టమోటా గుజ్జు కూడా కలిపి 3 నిమిషాల తర్వాత చికెన్‌ ముక్కలు కలపాలి. పదినిముషాల పాటు పెద్ద మంటపై ఉంచి, తర్వాత చిన్నమంట చేసి మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు పుదీనా ఆకులు, దనియాల పొడి, మిరియాల పొడి, పాలు కలిపి 5 నిమిషాలు ఉడికించి దించేయాలి. పుదీనా పరిమళంతో ఘుమ ఘుమలాడే చికెన్‌ రెడీ. 

Updated Date - 2015-09-01T16:49:58+05:30 IST