నేరేడు జామ్‌

ABN , First Publish Date - 2015-08-30T19:20:46+05:30 IST

కావలసిన పదార్థాలు: పండిన నేరేడు పళ్లు -పావు కేజీ, ఆపిల్‌ - పావు ముక్క, పంచదార -పావుకేజీ

నేరేడు జామ్‌

కావలసిన పదార్థాలు: పండిన నేరేడు పళ్లు -పావు కేజీ, ఆపిల్‌ - పావు ముక్క, పంచదార -పావుకేజీ, నిమ్మరసం - 1 టేబుల్‌ స్పూను, సోంపు పొడి - చిటికెడు.
తయారుచేసే విధానం: దళసరి అడుగున్న పాత్రలో శుభ్రంగా కడిగి తడిలేని నేరేడు పళ్లు, పంచదార వేసి వేడిచేయాలి. పళ్లు మెత్తబడ్డాక ఆపిల్‌ ముక్కలు వేసి 5 నిమిషాలుంచి మంట తీసెయ్యాలి. చల్లారిన తర్వాత గింజలు, తొక్క చేత్తో చిదిమి జల్లెడలో వడకట్టాలి. ఇప్పుడు నిమ్మరసం కలిపి మరోసారి లేత పాకం వచ్చేవరకు వేడిచేయాలి. తర్వాత సోంపు పొడి చల్లి మంట తీసెయ్యాలి. గది ఉష్ణోగ్రతకు వచ్చాక గాజు సీసాలో వేసి ఫ్రిజ్‌లో భద్రపరచాలి. 

Updated Date - 2015-08-30T19:20:46+05:30 IST