చికెన్‌ హార్ట్‌ ఫ్రై

ABN , First Publish Date - 2015-08-30T17:42:08+05:30 IST

కావలసినవి: చికెన్‌ కార్జం అరకిలో, ఎగ్స్‌ నాలుగు, పెద్దవుల్లి గడ్డలు రెండు, పచ్చిమిర్చి రెండు, మసాలా పౌడర్‌ ఒక స్పూన్‌

చికెన్‌ హార్ట్‌ ఫ్రై

కావలసినవి: చికెన్‌ కార్జం అరకిలో, ఎగ్స్‌ నాలుగు, పెద్దవుల్లి గడ్డలు రెండు, పచ్చిమిర్చి రెండు, మసాలా పౌడర్‌ ఒక స్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్‌, కరివేపాకు, కొత్తిమీర తగినంత, కారం ఒక స్పూన్‌, సాల్ట్‌ ఒక స్పూన్‌, నూనె ఒక గరిటె.
ఎలా చేయాలి
చికెన్‌ గుండె ముక్కలు వాటర్‌పోసి కడగాలి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. పొయ్యి మీద బాండలి వుంచి నూనె కాగిన తరువాత ఉల్లిముక్కలు, పచ్చిమిరప ముక్కలు, కరివేపాకు అన్నీ సన్నగా తరిగినవి వేసి కొంచెం సేపు వేయించాలి. తరువాత గుండె ముక్కలు వేసి బాగా గట్టిపడే వరకూ అంటే వేయించక ముందు మెరూన్‌ కలర్‌లో ఉంటాయి కదా. కొంచెం బ్లాక్‌, లేక స్వీట్‌ కలర్‌ వచ్చే వరకూ వేయించాలి. ఎగ్స్‌ ఉడకబెట్టి చక్రాలుగా కోసినవి కూడా వేసి కొంచెం వేయించాలి. ఉప్పూ కారం పసుపు ముక్కలు వేయగానే వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పౌడర్‌ తరువాత వేసి వేగనివ్వాలి. దించబోయే ముందు కారం వేయాలి. కొత్తిమీర పైన చల్లాలి.

Updated Date - 2015-08-30T17:42:08+05:30 IST