Abn logo

కర్జూరం కేక్‌

కావలసిన పదార్థాలు: (గింజలు తీసి, చిన్న ముక్కలుగా కట్‌ చేసిన) కర్జూరాలు - 18, పాలు - ముప్పావు కప్పు, బ్రౌన్‌షుగర్‌ - అరకప్పు, తేనె - పావు కప్పు, మైదా - 1 కప్పు, నూనె - అర కప్పు, బేకింగ్‌ సోడా - 1 టీ స్పూను, వాల్‌నట్స్‌ ముక్కలు - 2 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: ఒవెన్‌ను 350 డిగ్రీల వద్ద ప్రి - హీట్‌చేసి పెట్టుకోవాలి. పాలల్లో కర్జూరం ముక్కలు 2 గంటలు నానబెట్టి, 2 నిమిషాలు ఒవెన్‌లో పెట్టి తీసి, మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ పేస్టులో బ్రౌన్‌ షుగర్‌, తేనె, బేకింగ్‌ సోడా, మైదా ఒకటి తర్వాత ఒకటి కలుపుతూ ఉండలు చుట్టకుండా చూడాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన కేక్‌ పాన్‌లో పోసి, పైన వాల్‌నట్స్‌ చల్లి ఒవెన్‌లో 35 నిమిషాలు ఉంచి తీసెయ్యాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

‘సుద్దాల వాగుపై వంతెన నిర్మాణం ఉట్టిమాటేనా’నర్సరీలపై శిక్షణాతరగతులు ఇళ్లు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇవ్వాలి ‘హరితహారం’ లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్‌ భారతి హొళికేరిపట్టాల పంపిణీకి కసరత్తుయథేచ్ఛగా కాలువల కబ్జా రోడ్ల మరమ్మతుకు మోక్షమెప్పుడో?పోలీసుల డేగకన్ను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు ఘన నివాళిప్రాణహిత తీరంలో డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షణ
Advertisement
Advertisement