గుమ్మడి కాయ వాల్‌నట్స్‌ కేక్‌

ABN , First Publish Date - 2015-08-30T16:51:00+05:30 IST

కావలసిన పదార్థాలు: గుడ్లు - 2, గుమ్మడి గుజ్జు - 1 కప్పు, నూనె అర కప్పు, వెనిలా ఎసెన్స్‌ - 1 టీ స్పూను

గుమ్మడి కాయ వాల్‌నట్స్‌ కేక్‌

కావలసిన పదార్థాలు: గుడ్లు - 2, గుమ్మడి గుజ్జు - 1 కప్పు, నూనె అర కప్పు, వెనిలా ఎసెన్స్‌ - 1 టీ స్పూను, పంచదార - 1 కప్పు, మైదా - ఒకటిన్నర కప్పు, దాల్చినచెక్క పొడి - పావు టీ స్పూను, జాజికాయ పొడి - పావు టీ స్పూను, బేకింగ్‌ సోడా - అర టీ స్పూను, ఉప్పు - చిటికెడు, వాల్‌నట్స్‌ తరుగు - అర కప్పు.
తయారుచేసే విధానం: లోతైన వెడల్పాటి పాత్రలో గుడ్లు, గుమ్మడి గుజ్జు, నూనె, వెనీలా ఎసన్స్‌ వేసి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులోనే మైదా, పంచదార, దాల్చినచెక్క, జాజికాయ పొడులు, ఉప్పు, బేకింగ్‌ సోడా వేసి ఉండలు లేకుండా మరోసారి గిలకొట్టాలి. తర్వాత వాల్‌నట్స్‌ కలపాలి. ఓవెన్‌ను 350 డిగ్రీల (ఫా.హీ) దగ్గర ప్రీ హీట్‌ చేసుకుని వెన్న రాసిన దళసరి పాత్రలో పోసిన గుమ్మడి మిశ్రమాన్ని 35 నుండి 40 నిమిషాలు ఉంచాలి. చల్లారిన తర్వాత కేక్‌ను ముక్కలుగా కట్‌ చేసుకొని మర్రోజు తింటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టపడే బలమైన ఆహారం కూడా.

Updated Date - 2015-08-30T16:51:00+05:30 IST