పీతల బిర్యాని

ABN , First Publish Date - 2015-08-29T23:10:06+05:30 IST

కావలసిన పదార్థాలు: (బాసుమతి) బియ్యం - 250 గ్రా., (పెద్ద) పీతలు - 100 గ్రా., వెన్న - 50 గ్రా

పీతల బిర్యాని

కావలసిన పదార్థాలు: (బాసుమతి) బియ్యం - 250 గ్రా., (పెద్ద) పీతలు - 100 గ్రా., వెన్న - 50 గ్రా., ఉల్లిపాయలు - 2, టమోటాలు -2, పచ్చిమిర్చి - 1, జీరా, దనియా, మసాలపొడి - 1 టీ స్పూను చొప్పున, కారం - ఒకటిన్నర టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, పుదీనా, కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను చొప్పున, ఉప్పు - రుచికి తగినంత, (స్పూను పాలలో నానబెట్టిన) కుంకుమపువ్వు - 4 కాడలు, నెయ్యి - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: బియ్యంలో కుంకుమపువ్వు కలిపి (పొడిగా) అన్నం వండి పక్కనుంచాలి. కూరగాయల్ని సన్నగా తరగాలి. పీతలలో ఎముకల్ని తీసేయాలి (ఇష్టమైతే 4 పెద్ద ముక్కలుగా కట్‌ చేసుకోవచ్చు). కడాయిలో వెన్న కరిగించి ఉల్లి, మిర్చి, టమోటా, పుదీనా, కొత్తిమీర తరుగు, జీలకర్ర, కారం, పసుపు, గరం మసాల పొడులు ఒకటి తర్వాత ఒకటి దోరగా వేగించాలి. తర్వాత పీత ముక్కలు, ఉప్పు వేసి సన్నని మంటపై మూతపెట్టి మగ్గించాలి. పీత (ముక్కలు) ఉడికిన తర్వాత కడాయి దించేయాలి. ఒక లోతైన పాత్రలో ఉడికిన అన్నం, పీత మిశ్రమం ఒకదాని తర్వాత ఒకటి లేయర్లుగా పరిచి పైన నెయ్యి , కొన్ని పుదీనా ఆకులు చల్లి మూతపెట్టి సన్నని మంటపై రెండు నిమిషాలు ఉంచి దించేయాలి.

Updated Date - 2015-08-29T23:10:06+05:30 IST