అరటి తీపి బజ్జీలు

ABN , First Publish Date - 2015-08-29T22:27:58+05:30 IST

కావలసిన పదార్థాలు: అరటికాయలు - 2, గుడ్డు - 1, పంచదార - 2 టేబుల్‌ స్పూన్లు, దాల్చినచెక్క - పావు టీ స్పూను

అరటి తీపి బజ్జీలు

కావలసిన పదార్థాలు: అరటికాయలు - 2, గుడ్డు - 1, పంచదార - 2 టేబుల్‌ స్పూన్లు, దాల్చినచెక్క - పావు టీ స్పూను, మైదాపిండి - 6 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: పెద్ద పాత్రలో 1 టేబుల్‌ స్పూను పంచదార, ఉప్పు, గిలకొట్టిన గుడ్డుసొన వేసి మైదాను జతచేస్తూ సరిపడా నీటితో జారుగా కలుపు పోవాలి. మరో పాత్రలో మిగిలిన పంచదార, దాల్చిన చెక్క పొడిని కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు అరటి కాయల తొక్కతీసి అడ్డుగా సగానికి కోసి, పొడవాటి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. వీటిని మైదా జారులో ముంచుతూ నూనెలో దోరగా వేగించి తీసేయాలి. వీటిపై పంచదార, దాల్చినచెక్కల పొడిని చల్లి తింటే చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-08-29T22:27:58+05:30 IST