బనానా రోల్స్‌

ABN , First Publish Date - 2015-08-29T22:29:35+05:30 IST

కావలసిన పదార్థాలు: పండిన అరటిపండ్లు - 3, మైదా 4 టేబుల్‌ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు

బనానా రోల్స్‌

కావలసిన పదార్థాలు: పండిన అరటిపండ్లు - 3, మైదా 4 టేబుల్‌ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, పంచదార - అర టేబుల్‌ స్పూను, ఉప్పు - చిటికెడు, ఓట్స్‌ - అరకప్పు, నూనె - వేగించడానికి సరిపడా, గుడ్డు - 1, నీరు - అరకప్పు.
తయారుచేసే విఽధానం: ఒక పాత్రలో మైదా, కార్న్‌ఫ్లోర్‌, పంచదార, ఉప్పు, గిలకొట్టిన గుడ్డు, నీరు చేర్చి జారుగా కలుపుకోవాలి. తొక్కతీసి, మూడు సమాన భాగాలుగా కట్‌ చేసుకున్న అరటిపండు ముక్కల్ని జారులో ముంచి ఓట్స్‌లో పొర్లించి, నూనెలో దోరగా వేగించాలి. చూడ్డానికి అందంగా కనిపించే రోల్స్‌ టమోటా సాస్‌తో మరింత రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-08-29T22:29:35+05:30 IST