అనాస జామ్‌

ABN , First Publish Date - 2015-08-26T21:33:39+05:30 IST

కావలసిన పదార్థాలు: అనాస (పైనాపిల్‌) చిన్న ముక్కలు - 2 కప్పులు, నీరు - 1 కప్పు, పంచదార - 2 కప్పులు, నిమ్మకాయలు - 2.

అనాస జామ్‌

కావలసిన పదార్థాలు: అనాస (పైనాపిల్‌) చిన్న ముక్కలు - 2 కప్పులు, నీరు - 1 కప్పు, పంచదార - 2 కప్పులు, నిమ్మకాయలు - 2.
తయారుచేసే విధానం: మధ్యలోని కాడ, పై పొట్టు లేకుండా, శుభ్రంగా తరిగిన అనాస ముక్కల్లో నీరు కలిపి దళసరి అడుగున్న కడాయిలో 20 నిమిషాలు అడుగంటకుండా ఉడికించాలి. ముక్కలు మెత్తబడ్డాక పంచదార, నిమ్మరసం కలపాలి. ఇప్పుడు చిన్నమంటపై చిక్కబడేవరకు (దాదాపు 30 నిమిషాలు) ఉడికించి చల్లారనివ్వాలి. గాలి సోకని గాజు సీసాలో భద్రపరిచి ఫ్రిజ్‌లో పెడితే 3 నెలల వరకూ పాడవదు. పిల్లలు బ్రెడ్‌స్లయిసెస్‌పై తినడానికి బాగా ఇష్టపడతారు.
గమనిక: పైనాపిల్‌ మరీ పండిపోయి ఉండకూడదు.

Updated Date - 2015-08-26T21:33:39+05:30 IST