మామిడికాయ పులిహోర

కావలసినవి
 
బియ్యం- ఒక కప్పు, పచ్చిమామిడికాయ తరుగు- ఒక కప్పు, ఉప్పు-తగినంత, పసుపు-1/8 టీస్పూను.
 
తాలింపు కోసం: నువ్వులనూనె- మూడు టేబుల్‌స్పూన్లు, ఆవాలు- అర టీస్పూను, మినపప్పు-రెండు టీస్పూన్లు, శెనగపప్పు- ఒక టేబుల్‌స్పూను, కరివేపాకు-గుప్పెడు, ఇంగువ-చిటికెడు, అల్లం- చిన్నముక్క (తరిగి), పల్లీలు-మూడు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి-మూడు (సన్నగా, పొడుగ్గా తరిగి), ఎండుమిర్చి- మూడు.
 
తయారీవిధానం
 
బియ్యంలో సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. ఉడికిన అన్నాన్ని పెద్ద పళ్లెంలో పోసి పైన ఒక టీస్పూను నువ్వుల నూనె చల్లాలి. పల్లీలను నూనె వేయకుండా వేగించి పొట్టు తీసేయాలి. కళాయిలో నూనె వేడి చేసి ఆవాలు వేయాలి. అవి చిటపటలాడేటప్పుడు మినపప్పు, శెనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, పల్లీలు వేసి వేగించాలి. ఆ తర్వాత అల్లం తరుగు కూడా వేసి కొంచెంసేపు వేగించాలి. ఆ తర్వాత పసుపు, మామిడి తరుగును వేసి మూడు నిమిషాలు గరిటెతో అటు ఇటు తిప్పాలి. ఆ తరువాత ఉప్పు వేయాలి. ఈ తాలింపును అన్నంలో వేసి అంతా బాగా కలిసేలా కలపాలి.

పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలుసీసీ రోడ్డుపైనే బీటీ రోడ్డు నిర్మాణంపైకప్పు కూలినా.. పట్టింపు కరువుహెల్మెట్‌ ధరిస్తేనే రోడ్లపైకి అనుమతి : సీఐమూడు దశాబ్దాల సమస్యకు పరిష్కారం!కమ్ముకుంటున్న కారుమబ్బులువానాకాలం సాగుకు రైతులు సన్నద్ధంనత్తనడకన బావి నిర్మాణ పనులుతాంసిలో ఈదురు గాలులుమటన్‌ షాపుల వద్ద సండే సందడి
Advertisement
Advertisement