మష్రూమ్‌ స్టిర్‌ ఫ్రై

ABN , First Publish Date - 2018-01-13T21:41:19+05:30 IST

మష్రూమ్స్‌ ముక్కలు - ఒక కప్పు, గ్రీన్‌+ రెడ్‌+ ఎల్లో కాప్సికం తరుగు - ఒక కప్పు, బేబీ కార్న్‌ తరుగు...

మష్రూమ్‌ స్టిర్‌ ఫ్రై

కావలసిన పదార్థాలు
 
మష్రూమ్స్‌ ముక్కలు - ఒక కప్పు, గ్రీన్‌+ రెడ్‌+ ఎల్లో కాప్సికం తరుగు - ఒక కప్పు, బేబీ కార్న్‌ తరుగు - అరకప్పు, క్యారెట్‌ తరుగు - అరకప్పు, ఉల్లి తరుగు - అరకప్పు, ఉల్లికాడల తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, నూనె - 2 టీ స్పూన్లు, సోయా సాస్‌ - ఒక టేబుల్‌ స్పూను, వేగించిన నువ్వులు - 2 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, మిరియాల పొడి - తగినంత.
 
తయారుచేసే విధానం
 
ఒక పాన్‌లో ముందుగా నూనె వేడి చేసుకుని, దానిలో ఉల్లి, క్యారెట్‌ తరుగు వేసి రెండు నిమిషాలు వేగించండి. తర్వాత బేబీ కార్న్‌, కాప్సికం తరుగు వేసి ఐదు నిమిషాలు వేగించండి. మష్రూమ్స్‌ కూడా వేసి పాన్‌ పైన మూత పెట్టకుండా వేగించండి. మష్రూమ్స్‌ నుంచి వచ్చిన నీరు కొంచం ఇగిరిన తరువాత సోయా సాస్‌, నువ్వులు వేసి కలపండి. ఇప్పుడు ఉప్పు, మిరియాల పొడి వేసి స్టౌ మీద నుంచి దించి ఉల్లి కాడల తరుగు వేసి కలపండి. దీనిని స్నాక్‌గా కానీ, చపాతీలో కూరగా కానీ తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-01-13T21:41:19+05:30 IST