పంజాబీ కదీ పకోరా

ABN , First Publish Date - 2017-08-05T22:54:46+05:30 IST

కావలసిన పదార్థాలు పెరుగు- ఒకటిన్నర కప్పులు, కారం, పసుపు, గరం మసాలా- ఒక్కో టీ స్పూను చొప్పున, శనగపిండి- ఒక కప్పు, నూనె- వే

పంజాబీ కదీ పకోరా

కావలసిన పదార్థాలు
 
పెరుగు- ఒకటిన్నర కప్పులు, కారం, పసుపు, గరం మసాలా- ఒక్కో టీ స్పూను చొప్పున, శనగపిండి- ఒక కప్పు, నూనె- వేగించడానికి సరిపడా, ఉల్లిపాయలు- 2 (నిలువుగా కోసుకోవాలి), వాము- అర టీ స్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద- ఒక టేబుల్‌ స్పూను, మెంతులు- పావు టీ స్పూను, పచ్చిమిర్చి- 2, ఎండుమిర్చి- 3, జీలకర్ర- ఒక టీ స్పూను, కరివేపాకు- ఒక రెమ్మ, ఉల్లికాడలు- అర కట్ట, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం
 
ఒక గిన్నెలో పెరుగు, సగం శనగపిండి, అర టీ స్పూన్‌ చొప్పున కారం, పసుపు, గరం మసాలా వేసి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన సగం శనగపిండిలో జీలకర్ర, మిగిలిన కారం, గరం మసాలా వేసి కొద్దిగా ఉప్పు వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. సగం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి పకోడీలు వేసుకోవాలి. తర్వాత ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక వాము, మెంతులు, ఇంగువ వేసి వేగించాలి. తర్వాత మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేసి 3 నిమిషాలు వేగించి అల్లంవెల్లుల్లి ముద్ద, ఎండుమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేయాలి. వీటిని చిన్న మంట మీద 2 నిమిషాలు వేగించి, పెరుగు మిశ్రమం వేసి బాగా కలిపి పావుగంట సేపు ఉడికించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ పకోడీలను వేయాలి. 10 నిమిషాలు ఉడికించిన తర్వాత గరం మసాలా వేసి చిన్నమంట మీద 2 నిమిషాలు ఉడికించి దించేయాలి.

Updated Date - 2017-08-05T22:54:46+05:30 IST