కాజూ కూర

ABN , First Publish Date - 2017-07-29T23:03:49+05:30 IST

కావలసిన పదార్థాలు పచ్చి జీడిపప్పు (బద్దలు) - ఒక కప్పు, వంకాయలు - పావు కిలో, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 5, టమోటాలు

కాజూ కూర

కావలసిన పదార్థాలు
 
పచ్చి జీడిపప్పు (బద్దలు) - ఒక కప్పు, వంకాయలు - పావు కిలో, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 5, టమోటాలు - 3, పసుపు - అర టీ స్పూను, కారం - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, గరం మసాల - పావు టీ స్పూను, అల్లం, వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తిమీర - అర కప్పు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు.
 
తయారుచేసే విధానం
 
నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, వంకాయ ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించి అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. 2 నిమిషాల తర్వాత కారం, పసుపు, పచ్చి జీడిపప్పు బద్దలు వేసి అర కప్పు నీరు పోసి ఉడికించాలి. దించేముందు గరం మసాల, కొత్తిమీర తరుగు చల్లాలి.

Updated Date - 2017-07-29T23:03:49+05:30 IST