ముల్లంగి - పాలకూర

ABN , First Publish Date - 2017-05-27T20:42:27+05:30 IST

కావలసిన పదార్థాలు ముల్లంగి ముక్కలు- ఒక కప్పు, పాలకూర

ముల్లంగి - పాలకూర

కావలసిన పదార్థాలు
 
ముల్లంగి ముక్కలు- ఒక కప్పు, పాలకూర- అర కప్పు, పచ్చిమిర్చి- 4, వెల్లుల్లి రెబ్బలు- 4, ధనియాల పొడి- అర టీ స్పూను, కారం, పసుపు- అర టీ స్పూను చొప్పున, జీలకర్ర- ఒక టీ స్పూను, నూనె- ఒక టీ స్పూను, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం
 
కుక్కర్‌లో నూనె పోసి వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ముల్లంగి ముక్కలు వేసి బాగా వేగించాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి మూత పెట్టి నాలుగు విజిల్స్‌ వచ్చే దాకా ఉడికించాలి. తర్వాత
స్టవ్‌ మీద నుంచి దించేయాలి. తర్వాత పాలకూర తరుగు వేసి చిన్న మంట
మీద ఐదు నిమిషాలు ఉడికించాలి.

Updated Date - 2017-05-27T20:42:27+05:30 IST