కాలీ ఫ్లవర్ వేపుడు

ABN , First Publish Date - 2017-01-07T17:49:07+05:30 IST

కావలసిన పదార్థాలు బ్రకొలి - 1 శనగపప్పు - 1 టే.స్పూను

కాలీ ఫ్లవర్ వేపుడు

కావలసిన పదార్థాలు
బ్రకొలి - 1
శనగపప్పు - 1 టే.స్పూను
మినప్పప్పు - 1 టే.స్పూను
కొబ్బరి తురుము - 1 టే.స్పూను
కారం - 1 టీస్పూను
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
ఆవాలు, జీలకర్ర - చెరో అర టీస్పూను
కరివేపాకు - 2 రెమ్మలు
నూనె - సరిపడా

నువ్వులు - 1 టే.స్పూను.
 
తయారీ విధానం
బ్రకొలిని చిన్న ముక్కలుగా విడదీసి ఉంచుకోవాలి.
బాండీలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి.
తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి.
తర్వాత కొబ్బరి కోరు వేసి గోధుమరంగుకు వచ్చేవరకూ వేయించాలి.
బ్రకొలి ముక్కలు వేసి మూత ఉంచి 3 ని.లపాటు ఉడికించాలి.
తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి.
మరో 2 ని.లపాటు కలుపుతూ వేయించాలి. ఇలా వేయుస్తున్నప్పుడు మూత పెట్టకూడదు.
చివర్లో వేయించిన నువ్వులు చల్లి వేడిగా సర్వ్‌ చేయాలి.
ఈ ఫ్రై చపాతీతో బాగుంటుంది.

Updated Date - 2017-01-07T17:49:07+05:30 IST