దాలియా కిచిడీ అండ్‌ కర్డ్‌

ABN , First Publish Date - 2017-02-11T17:51:50+05:30 IST

కావలసినవి గోధుమరవ్వ - ఒకటిన్నర కప్పు, పెసరపప్పు - ఒక కప్పు, నాలుగైదు రకాల

దాలియా కిచిడీ అండ్‌ కర్డ్‌

కావలసిన పదార్థాలు
 
గోధుమరవ్వ - ఒకటిన్నర కప్పు, పెసరపప్పు - ఒక కప్పు, నాలుగైదు రకాల కూరగాయలు - అరకేజీ, ఆవాలు, జీలకర్ర - ఒక్కో టీస్పూన్‌ చొప్పున, ఇంగువ - చిటికెడు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - మూడు, అల్లం - చిన్న ముక్క, వెలుల్లి రెబ్బలు - ఆరు, కారం, పసుపు, ధనియాల పొడి - ఒక్కో టీస్పూన్‌ చొప్పున, నెయ్యి - రెండు టీస్పూన్‌లు, నీళ్లు - తొమ్మిది కప్పులు, కొత్తిమీర - ఒక కట్ట.
 
తయారీ విధానం
 
కూరగాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లంలను సన్నగా తరగాలి. కుక్కర్‌లో నెయ్యి వేడి చేశాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం తరుగుతో పాటు వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఉల్లిపాయలు వేగాక కారం, పసుపు, ధనియాల పొడి వేసి సన్నటి మంట మీద ఒక నిమిషం ఉంచాలి. తరువాత తరిగిన కూరగాయలు, గోధుమరవ్వ, పెసరపప్పు వేసి, నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి కుక్కర్‌ మూత పెట్టాలి. మొదటి విజిల్‌ వచ్చేంత వరకు స్టవ్‌ మంట ఎక్కువగా పెట్టాలి. తరువాత తగ్గించి ఐదు నుంచి ఆరు విజిల్స్‌ వచ్చే వరకు ఉంచి దింపాలి. కొత్తిమీర, నెయ్యిలతో అలంకరించి వేడి వేడిగా తింటే యమ్మీగా ఉంటుంది.

Updated Date - 2017-02-11T17:51:50+05:30 IST