ముంగోడీ కర్రీ

ABN , First Publish Date - 2017-02-04T21:30:55+05:30 IST

కావలసిన పదార్థాలు కందిపప్పు- ఒక కప్పు, మినప్పప్పు- అర కప్పు, ఇంగువ- చిటికెడు, తరిగిన ఉల్లిపాయ, టమోట- ఒక్కోటి చొప్పున, పచ్చిమిర్చి- 3,

ముంగోడీ కర్రీ

కావలసిన పదార్థాలు

కందిపప్పు- ఒక కప్పు, మినప్పప్పు- అర కప్పు, ఇంగువ- చిటికెడు, తరిగిన ఉల్లిపాయ, టమోట- ఒక్కోటి చొప్పున, పచ్చిమిర్చి- 3, అల్లం తురుము- ఒక టీస్పూను, జీలకర్ర- అర టీ స్పూను, ధనియాల పొడి- ఒక టీస్పూను, పసుపు- పావు టీ స్పూను, కారం- ఒక టేబుల్‌ స్పూను, ఉప్పు- తగినంత, నూనె- వేగించడానికి సరిపడా.
 
తయారీ విధానం
కందిపప్పు, మినప్పప్పులను ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టుకో వాలి. తర్వాత ఇంగువ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అర టీస్పూను అల్లం తురుము వేసి పుణుగుల్లా నూనెలో వేగించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణలిలో 2 టీస్పూన్ల నూనె పోసి జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మిగిలిన అల్లం తురుము వేసి వేగించాలి. తర్వాత టమోటా, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి 2 నిమిషాలు వేగించి 2 గ్లాసుల నీళ్లు పోసి 5 నిమిషాలు ఉడికించాలి. చివర్లో పుణుగులను వేసి మరో 2 నిమిషాలు ఉడికించి దించేయాలి

Updated Date - 2017-02-04T21:30:55+05:30 IST