గోంగూర పన్నీర్ కర్రీ

ABN , First Publish Date - 2016-11-12T18:19:50+05:30 IST

గోంగూర పన్నీర్ కర్రీ

గోంగూర పన్నీర్ కర్రీ

కావలసిన పదార్థాలు:
గోంగూర- ఒక కట్ట, పనీర్‌- 100 గ్రా., నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయలు- రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద- ఒక టేబుల్‌ స్పూను, పచ్చిమిర్చి- ఆరు, జీలకర్ర- ఒక టీ స్పూను, కారం- ఒక టీ స్పూను, పసుపు- అర టీ స్పూను, ధనియాల పొడి- రెండు టీ స్పూన్లు, కరివేపాకు- కొద్దిగా, గరం మసాలా- అర టీ స్పూను, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం:బాణలిలో ఒక టేబుల్‌ స్పూన్‌ నూనె వేసి పనీర్‌ ముక్కలను వేగించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాణలిలో అల్లంవెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి రెండు నిమిషాలు వేగించాలి. తర్వాత గోంగూర వేసి చిన్నమంట మీద మూతపెట్టి ఉడికించి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత బాణలిలో మిగిలిన నూనె వేసి వేడెక్కాక జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి వేగించాలి. తర్వాత గోంగూర, కారం, ధనియాల పొడి, గరంమసాలా, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి రెండు నిమిషాలు ఉడికించాలి. చివరగా పనీర్‌ ముక్కలను వేసి బాగా కలిపి నిమిషం పాటు ఉడికించి దింపేయాలి.

Updated Date - 2016-11-12T18:19:50+05:30 IST