బ్రెడ్ బిర్యానీ

ABN , First Publish Date - 2016-11-26T19:48:29+05:30 IST

కావలసిన పదార్థాలు బ్రెడ్‌ ముక్కలు- 7, నూనె- 2 టేబుల్‌ స్పూన్లు, సోంపు- ఒక టేబుల్‌ స్పూను, దాల్చిన

బ్రెడ్ బిర్యానీ

కావలసిన పదార్థాలు
బ్రెడ్‌ ముక్కలు- 7, నూనె- 2 టేబుల్‌ స్పూన్లు, సోంపు- ఒక టేబుల్‌ స్పూను, దాల్చిన చెక్క- చిన్న ముక్క, అల్లం వెల్లుల్లి ముద్ద- ఒక టేబుల్‌ స్పూను, తరిగిన క్యారెట్‌, క్యాప్సికమ్‌- ఒక్కోటి చొప్పున, తరిగిన టమోటా లు- 2, పచ్చిమిర్చి- 3, కారం- 2టీ స్పూన్లు, పసుపు- ఒక టీ స్పూను, గరం మసాలా- 2 టీ స్పూన్లు, ధనియాల పొడి- ఒక టేబుల్‌ స్పూను, కొత్తిమీర, పుదీన- చెరో కట్ట, పెరుగు- అర కప్పు, చక్కెర- ఒక టీ స్పూను, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం
బ్రెడ్‌ ముక్కలను చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించుకుని పెనం మీద కాల్చాలి. తర్వాత ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక దాల్చిన చెక్క, సోంపు వేసి వేగించాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి 2 నిమిషాలు వేగించాలి. టమోటాలు, ఉప్పు, చక్కెర కూడా వేసి 5 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత క్యాప్సికమ్‌, కారెట్‌, గరం మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు వేసి అర గ్లాసు నీళ్లు పోసి మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉడికించాలి. చివరగా బ్రెడ్‌ ముక్కలు వేసి బాగా కలిపి చిన్నమంట మీద మరో 2 నిమిషాలు ఉడికించి దించేయాలి.

Updated Date - 2016-11-26T19:48:29+05:30 IST