బ్రౌన్ గ్రేవీ
ఉల్లిపాయలు - కిలో/ టొమాటో - ఒకటిన్నర కిలోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 30 గ్రా, కారం - 10 గ్రా, పసుపు - 5 గ్రా, ధనియాల పొడి - 15 గ్రా, గరం మసాలా - 10 గ్రా, ఉప్పు - తగినంత.
నూనెలో ఉల్లిపాయలు ఎర్రబడేవరకూ వేగించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తర్వాత టమాటాలు, మసాలా దినుసులు, ఉప్పు వేసి నూనె పైకి తేలేంతవరకూ వేగించాలి. అవసరమనుకుంటే కొన్ని నీళ్లు పోయాలి. తర్వాత చిన్న మంట ఉంచి చిక్కబడేవరకూ ఉడికించాలి.