దహీ ఆలూ

ABN , First Publish Date - 2016-03-31T16:15:11+05:30 IST

వేసవి వస్తే పెరుగు మిశ్రమంతో బోలెడన్ని వంటకాలు చేస్తుంటారు. ఎందుకంటే పెరుగు చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి. ఈ వేసవికి మీ ఇంట్లో కూడా దహీ ఆలూ రెసిపీ తయారుచేయండి.

దహీ ఆలూ

వేసవి వస్తే పెరుగు మిశ్రమంతో బోలెడన్ని వంటకాలు చేస్తుంటారు. ఎందుకంటే పెరుగు చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి. ఈ వేసవికి మీ ఇంట్లో కూడా దహీ ఆలూ రెసిపీ తయారుచేయండి.
కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు పెరుగు, రెండు టీ స్పూన్ల శనగపిండి, ఒకటిన్నర కప్పుల నీళ్లు, మూడొందల గ్రాములు ఉడికించిన బంగాళదుంపలు, రెండు టేబుల్‌ స్పూన్ల ఆయిల్‌, కాసిని ఆవాలు, జీలకర్ర, అరకప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు
రెండు తరిగిన పచ్చిమిరపకాయలు, ఒక టొమాటో, కొన్ని అల్లం ముక్కలు, కరివేపాకు, పసుపు, గరంమసాలా, ధనియాల పొడి, ఉప్పు.
 
తయారుచేసే విధానం : ముందుగా బంగాళదుంపల్ని కుక్కర్‌లో పెట్టి ఉడికించుకుని.. తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. మరో పాత్రలో పెరుగు, శనగపిండి, నీళ్లు మిశ్రమాన్ని కలియబెట్టాలి. ఇప్పుడు బాణిలి తీసుకుని అందులో కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి. ఆఖర్న ఉడికించిన బంగాళదుంపల్ని మెత్తగా నలిపి బాణిలిలో వేయాలి. పసుపు, గరం మసాల, ధనియాల పొడి, ఉప్పు వేసి పది నిమిషాలు వేగనివ్వాలి. ఆ తరువాత సన్నటి సెగ మీద ఉండనివ్వాలి. వేడి తగ్గిన తరువాత పెరుగు-శనగపిండి మిశ్రమాన్ని బాణిలిలో పోసి... కలియబెట్టాలి. కొంచెం నీళ్లు పోసి మళ్లీ చిటికెడు గరంమసాల, ఉప్పు చల్లుకోవాలి. రెండు మూడు నిమిషాలకు మిశ్రమం గట్టిపడుతుంది. అప్పుడు పొయ్యి మీద నుంచి దించేసి చల్లబడిన తరువాత తినొచ్చు. మంచి సువాసన వెదజల్లేందుకు కొత్తిమీర, పుదీన ఆకుల్ని వేసుకోవచ్చు. ఈ దహీ ఆలు రెసిపీ చపాతీ, రోటీ, జీరారైస్‌, వెజిటబుల్‌ రైస్‌, వైట్‌ రైస్‌, పలావ్‌లలోకి రుచికరంగా ఉంటుంది. దానికితోడు వేసవిలో కడుపులో చల్లగా కూడా ఉంటుంది.

Updated Date - 2016-03-31T16:15:11+05:30 IST