పాస్తా చాట్‌

ABN , First Publish Date - 2016-01-31T17:34:53+05:30 IST

కావలసిన పదార్థాలు: పాస్తా - ఒక కప్పు (ఉడికించి), ఎర్ర క్యాప్సికమ్‌ (తరిగి) - పావు ముక్క, ఉల్లికాడలు లేదా ఉల్లిపాయ తరుగు - కొంచెం, వేగించిన పల్లీ గింజలు - కొన్ని,

పాస్తా చాట్‌

కావలసిన పదార్థాలు: పాస్తా - ఒక కప్పు (ఉడికించి), ఎర్ర క్యాప్సికమ్‌ (తరిగి) - పావు ముక్క, ఉల్లికాడలు లేదా ఉల్లిపాయ తరుగు - కొంచెం, వేగించిన పల్లీ గింజలు - కొన్ని, కొత్తిమీర తరుగు - ఒకటి నుంచి రెండు టేబుల్‌ స్పూన్లు, మిరియాల పొడి, చాట్‌ మసాలా - సరిపడా, ఆమ్‌చూర్‌ - కొంచెం (ఇష్టపడితే), ఆలివ్‌ నూనె - ఒక టేబుల్‌ స్పూన్.
తయారీ విధానం: నీళ్లు మరిగించి అందులో ఉప్పు, పాస్తా వేయాలి. పాస్తా మరీ మెత్తగా కాకుండా ఉడికించాలి. సగం ఉడికించిన పాస్తా మీద చల్లటి నీళ్లు పోసి నీళ్లను వంపేయాలి. తరువాత పాస్తాలో బూందీ లేదా సేవ్‌ వేసి కలిపి ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తరువాత తింటుంటే ఇండో-ఇటాలియన రుచి నోటికి అందుతుంది.

Updated Date - 2016-01-31T17:34:53+05:30 IST