సజ్జల కిచిడి

ABN , First Publish Date - 2016-02-01T16:07:22+05:30 IST

కావలసిన పదార్థాలు: సజ్జలు- అరకప్పు, పెసరపప్పు- పావుకప్పు, క్యారెట్‌, బీన్స్‌(తరిగి), బఠానీ, మొక్కజొన్న గింజలు అన్నీ కలిపి- ఒక కప్పు, కారం- ఒక టీస్పూను,

సజ్జల కిచిడి

కావలసిన పదార్థాలు: సజ్జలు- అరకప్పు, పెసరపప్పు- పావుకప్పు, క్యారెట్‌, బీన్స్‌(తరిగి), బఠానీ, మొక్కజొన్న గింజలు అన్నీ కలిపి- ఒక కప్పు, కారం- ఒక టీస్పూను, ఉల్లిపాయ(తరిగి), ఎండుమిర్చి- ఒక్కోటి చొప్పున, పసుపు- పావుటీస్పూను, జీలకర్ర- ఒక టీస్పూను, ఉప్పు- తగినంత.
తయారీ విధానం: సజ్జలు, పెసరపప్పును వేరు వేరుగా అరగంటపాటు నానబెట్టాలి. ప్రెషర్‌ కుక్కర్‌లో రెండు టీస్పూన్ల నూనె వేడి చేసి జీలకర్ర, ఉల్లిపాయలు వేసి అవి గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి. ఆ తరువాత కూరగాయ ముక్కలు వేసి మూడు నిమిషాలపాటు వేగించాలి. నానబెట్టిన సజ్జలు, పెసరపప్పును కడిగి, నీళ్లు వడకట్టి కుక్కర్‌లో రెండు నిమిషాలు వేగించాలి. ఆ తరువాత పసుపు, ఉప్పు, కారం, వేసి మూడు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టేయాలి. ఐదారు విజిల్స్‌ వచ్చేవరకు సన్నటి మంటపై ఉడికించాలి. ప్రెషర్‌ పోయి విజిల్‌ తీసాక కుక్కర్‌లో ఇంకా నీళ్లు ఉంటే అవి ఆవిరయ్యే వరకు వేడి చేస్తే సరి. నోరూరించే సజ్జల కిచిడీ తయారవుతుంది.. దీన్ని పెరుగుతో లేదా ఏదైనా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2016-02-01T16:07:22+05:30 IST