ఖస్‌ఖస్‌ ఆలూ

ABN , First Publish Date - 2016-01-22T15:47:33+05:30 IST

కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి- మూడు బంగాళా దుంపలు ( తొక్క తీసి పెద్ద ముక్కలుగా తరిగి)- ఆరు, పసుపు- అరటీస్పూను, కొత్తిమీర తరుగు- పావు కప్పు, ఎండు

ఖస్‌ఖస్‌ ఆలూ

కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి- మూడు బంగాళా దుంపలు ( తొక్క తీసి పెద్ద ముక్కలుగా తరిగి)- ఆరు, పసుపు- అరటీస్పూను, కొత్తిమీర తరుగు- పావు కప్పు, ఎండు మిర్చి- మూడు, గసగసాలు- రెండు టేబుల్‌స్పూన్లు, నూనె- మూడు టేబుల్‌స్పూన్లు, నీళ్లు- అరకప్పు, ఉప్పు- తగినంత
తయారీ విధానం: గసగసాలని రెండు నిమిషాలపాటు వేగించుకొని పచ్చిమిర్చి, కొద్దిగా నీరు పోసి మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. పాన్‌లో నూనె పోసి వేడైన తరువాత బంగాళా దుంపల ముక్కలు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో లేదా వేరొక పాన్‌లో నూనె వేడి చేసి ఎండు మిర్చి, పసుపు వేసి కొద్దిగా వేగించాలి. దానిలో గసగసాల పేస్టు వేసి తక్కువ మంటపై నూనె పైకి తేలే వరకు లేదా ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. ఆ తరువాత బంగాళా దుంపలు, ఉప్పు వేసి పావుగంట పాటు కలుపుతూ ఉండాలి. బంగాళా దుంపలు ఉడికిన తరువాత స్టవ్‌ ఆపేయాలి. దీన్ని వేడి వేడిగా పూరీల్లో తింటే చాలా టేసీగా ఉంటుంది.

Updated Date - 2016-01-22T15:47:33+05:30 IST