మసాలా చామ

ABN , First Publish Date - 2016-01-23T16:17:06+05:30 IST

కావలసిన పదార్థాలు: ఉడికించి, తోలు తీసిన చామదుంప ముక్కలు- రెండు కప్పులు, నూనె- 5 టీ స్పూన్లు, ఆవాలు, జీలకర్ర, సోంపు, పసుపు- ఒక్కోటి 1/4 టీ స్పూను చొప్పున, వాము, మెంతులు- చిటికెడు చొప్పున, అల్లం

మసాలా చామ

కావలసిన పదార్థాలు: ఉడికించి, తోలు తీసిన చామదుంప ముక్కలు- రెండు కప్పులు, నూనె- 5 టీ స్పూన్లు, ఆవాలు, జీలకర్ర, సోంపు, పసుపు- ఒక్కోటి 1/4 టీ స్పూను చొప్పున, వాము, మెంతులు- చిటికెడు చొప్పున, అల్లం తురుము- 1/2 టీ స్పూను, పచ్చిమిర్చి- 2, కారం- 1/2 టీ స్పూను, ఛాట్‌ మసాల- 1/4 టీ స్పూను, గరం మసాల- 1/2 టీ స్పూను, కరివేపాకు- ఒక రెబ్బ, ఉప్పు- రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు- 1 టీ స్పూను
 
తయారీ విధానం: బాణలిలో మూడు టీ స్పూన్ల నూనె వేసి చామ దుంప ముక్కలను దోరగా వేగించి తియ్యాలి. తరువాత మిగతా నూనె కూడా వేసి ఆవాలు, వాము, జీలకర్ర, మెంతులు, సోంపు వేసి దోరగా వేగించాలి. ఆ తరువాత కరివేపాకు, అల్లం తురుము, పచ్చిమిర్చి కూడా వేసి వేగించి, కారం, పసుపు, ఉప్పు, ఛాట్‌ మసాలా, గరం మసాల, చామ దుంప ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు వేగించి కొత్తిమీర జల్లి దించేయాలి. ఇది చపాతీలకు మంచి కాంబినేషన్.

Updated Date - 2016-01-23T16:17:06+05:30 IST