అర్బీ ఫ్రై

ABN , First Publish Date - 2016-01-21T15:41:27+05:30 IST

కావలసిన పదార్థాలు: చేమదుంపలు- అరకేజీ, అల్లం పేస్టు- రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి(పేస్టు)- మూడు, మామిడికాయ పొడి- చిటికెడు, రాతి ఉప్పు, కారం- తగినంత,

అర్బీ ఫ్రై

కావలసిన పదార్థాలు: చేమదుంపలు- అరకేజీ, అల్లం పేస్టు- రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి(పేస్టు)- మూడు, మామిడికాయ పొడి- చిటికెడు, రాతి ఉప్పు, కారం- తగినంత, వాము- పావు టీస్పూను, ధనియాల పొడి- పావు టీస్పూను.
తయారీ విధానం: చేమ దుపంల్ని ఉడికించి పొట్టు తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి ఆ ముక్కలు గోధుమరంగులోకి వచ్చేంత వరకు వేగించుకోవాలి. వేరొక పాన్‌లో ఒక టేబుల్‌స్పూను నూనె వేసి అల్లం, పచ్చిమిర్చి పేస్టుని రెండు నిమిషాలు వేగించి చేమదుంపల ముక్కల్లో వేసి కలపాలి. తరువాత ఉప్పు, ధనియాలపొడి, మామిడికాయ పొడి, వాము వేసి కలపాలి. కొద్దిసేపటి తరువాత స్టవ్‌ ఆపేసి కొత్తమీర చల్లి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2016-01-21T15:41:27+05:30 IST