కర్జూర హల్వా

ABN , First Publish Date - 2015-09-02T18:29:02+05:30 IST

కావలసిన పదార్థాలు: గింజలు తీసిన కర్జూరాలు - పావుకిలో, పాలు - 50 మి.గ్రా,

కర్జూర హల్వా

కావలసిన పదార్థాలు: గింజలు తీసిన కర్జూరాలు - పావుకిలో, పాలు - 50 మి.గ్రా, పంచదార - 40 గ్రాములు, నెయ్యి - 50 గ్రాములు, జీడిపప్పు- 10 గ్రాములు, పిస్తాపప్పు- 10 గ్రాములు.
తయారుచేసే విధానం: దళసరి అడుగున్న పాత్రలో పాలు వేడి చేసి, కర్జూరాలను, పంచదారని వేసి గరిటతో తిప్పుతూ నెయ్యి కూడా వేసి అడుగంటకుండా చూడాలి. సగం జీడిపప్పుని జతచేయాలి. సన్నని సెగపైన ఉంచాలి. హల్వా బాగా చిక్కబడ్డాక, దించి మిగతా జీడిపప్పు, పిస్తాపప్పులతో అలంకరించుకోవాలి.

Updated Date - 2015-09-02T18:29:02+05:30 IST