నవరత్న కుర్మా

ABN , First Publish Date - 2015-12-31T14:59:37+05:30 IST

కావలసిన పదార్థాలు: సొరకాయ ముక్కలు ఒక కప్పు, బంగాళ దుంప ముక్కలు ఒక కప్పు (ఉడికించినవి), టమోటా ముక్కలు ఒక కప్పు, క్యాప్సికమ్‌ పావు కప్పు, స్వీట్‌కార్న్‌

నవరత్న కుర్మా

కావలసిన పదార్థాలు: సొరకాయ ముక్కలు ఒక కప్పు, బంగాళ దుంప ముక్కలు ఒక కప్పు (ఉడికించినవి), టమోటా ముక్కలు ఒక కప్పు, క్యాప్సికమ్‌ పావు కప్పు, స్వీట్‌కార్న్‌ పావు కప్పు, క్యారెట్‌ తురుము పావు కప్పు దోసకాయ అర కప్పు ( ఉడికించినది), పన్నీర్‌ అరకప్పు (వేయించినవి), కాబూల్‌ శనగలు పావు కప్పు (ఉడికించినవి), నూనె నాలుగు స్పూన్లు, పచ్చిపప్పు, ఆవాలు, జీర, సాయిపప్పు- రెండు స్పూన్లు, జీడిపప్పు పది పలుకులు  కారం, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిర్చి రెండు, కొత్తిమీర స్పూను, కరివేపాకు రెండు రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉల్లి పాయ ముక్కలు పావు కప్పు, గరం మసాలా చిటికెడు.
తయారీ విధానం: ఓ పాత్రలో నూనె పోసి కాగిన తరువాత ఎండు మిర్చి, పచ్చిమిర్చి, జీర, ఆవాలు, పప్పులు, జీడిపప్పు, కరివేపాకు, ఇంగువ వేసి వే యించాలి. వేగిన తరువాత సొరకాయ ముక్కల్ని వేయాలి. ఈ ముక్కలు కూడా కాస్త వేగిన తరువాత బంగాళ దుంపలతో పాటూ మిగతా పదార్థాలను వేయాలి. ఇవన్నీ వేగిన తరువాత ఒక కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. కూర కాస్త దగ్గరికి అవుతున్నప్పుడు ఉప్పు, కారం, గరం మసాల, పసుపు, కొత్తిమీర వేసి బాగా కలిపి ఓ ఐదు నిమిషాయల తరువాత దించేయాలి. అంతే ఘుమఘుమలాడే నవరత్న కూర్మా రెడీ! ఇది అన్నం, చపాతీ, రోటీల్లోకి చాలా బాగుంటుంది. గుడ్డు అంటే ఇష్టం ఉన్న వారు ఇందులో గుడ్డు కూడా కలుపుకోవచ్చు.

Updated Date - 2015-12-31T14:59:37+05:30 IST