గుత్త్తివంకాయ కూర

ABN , First Publish Date - 2015-12-14T20:42:05+05:30 IST

కావలసిన పదార్థాలు: వంకాయలు - పావుకిలో, చింతపండు - నిమ్మకాయ సైజు, నూనె - తగినంత, ఉల్లిపాయ - ఒకటి, ద్రాక్షంచెక్క- ఒకటి, కారం - ఒక టీ స్పూను, ధనియాల

గుత్త్తివంకాయ కూర

కావలసిన పదార్థాలు: వంకాయలు - పావుకిలో, చింతపండు - నిమ్మకాయ సైజు, నూనె - తగినంత, ఉల్లిపాయ - ఒకటి, ద్రాక్షంచెక్క- ఒకటి, కారం - ఒక టీ స్పూను, ధనియాల పొడి - ఒక టీ స్పూను, వెల్లుల్లి రేకలు - నాలుగు, నెయ్యి - రెండు టీ స్పూన్లు, నువ్వులు - 30 గ్రాములు, పల్లీలు - 30 గ్రాములు, ఉప్పు - తగినంత, మెంతులు - అర టీ స్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు.
తయారుచేయు విధానం: స్టౌ మీద వెడల్పాటి గిన్నె పెట్టి కొద్దిగా నూనె పోసి కాగాక ద్రాక్షం చెక్క, వెల్లుల్లి రేకలు, పల్లీలు, నువ్వులు, వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఎర్రగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. కోసిన వంకాయల్లో ఈ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టుకొని సరిపడా నూనె పోసి బాగా కాగాక కరివేపాకు, మెంతులు వేసి వేయించుకోవాలి. తరువాత వంకాల్ని కూడా వేసి బాగా వేయించాలి. కొద్ది సేపు నూనెలో మగ్గాక చింతపండు రసాన్ని వేసి ఉడికించాలి. అన్నంలోకి, రాగి సంకటిలోకి ఈ కూర చాలా బాగుంటుంది.

Updated Date - 2015-12-14T20:42:05+05:30 IST