అవియల్‌

ABN , First Publish Date - 2015-12-14T20:22:36+05:30 IST

కావాల్సిన పదార్థాలు: క్యారెట్‌ - 200 గ్రాములు, బీన్స్‌ - 250 గ్రాములు, తెల్ల గుమ్మడికాయ - 250 గ్రాములు, అరటికాయలు - రెండు, పచ్చిమిరపకాయలు - పది

అవియల్‌

కావాల్సిన పదార్థాలు: క్యారెట్‌ - 200 గ్రాములు, బీన్స్‌ - 250 గ్రాములు, తెల్ల గుమ్మడికాయ - 250 గ్రాములు, అరటికాయలు - రెండు, పచ్చిమిరపకాయలు - పది, పొట్లకాయ - 250 గ్రాములు, మునగకాయలు - మూడు, అల్లం - కొద్దిగా, కరివేపాకు - రెండు రెబ్బలు, కొబ్బరి తురుము - రెండు టేబుల్‌ స్పూన్లు, పసుపు - ఒక టీ స్పూను, పెరుగు - 500 గ్రాములు, జీలకర్ర - పది గ్రాములు, కొబ్బరినూనె -100 గ్రాములు, ఉప్పు - తగినంత.
తయారీ విధానం: కూరగాయలంటినీ వేలు సైజులో కోసుకోవాలి. వీటికి కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. పదినిమిషాల తర్వాత వాటిని ఉడికించి పెట్టుకోవాలి. కొబ్బరి తురుము, నాలుగు పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. గిన్నెలో కొబ్బరి నూనె వేసి వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగాక, కొబ్బరి ముద్ద వేసి, అదీ వేగాక కూరగాయ ముక్కలు వేయాలి. చివర్లో కొద్దిగా పెరుగు వేసి ఉడికించుకోవాలి. దీన్నే అవియల్‌ అంటారు. దీనిని అన్నంలో ఇష్టంగా తింటారు.

Updated Date - 2015-12-14T20:22:36+05:30 IST