ఆలూ కుర్మా

ABN , First Publish Date - 2015-11-05T15:08:25+05:30 IST

కావలసిన పదార్థాలు: బంగాళాదుంపలు పెద్దవి: మూడు(ఉడికించి, ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి), ఉల్లిపాయ పెద్దది: ఒకటి(ముక్కలుగా చేసుకోవాలి), పచ్చిమిరపకాయలు: రెండు లేదా మూడు

ఆలూ కుర్మా

కావలసిన పదార్థాలు: బంగాళాదుంపలు పెద్దవి: మూడు(ఉడికించి, ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి), ఉల్లిపాయ పెద్దది: ఒకటి(ముక్కలుగా చేసుకోవాలి), పచ్చిమిరపకాయలు: రెండు లేదా మూడు (పొడవుగా తరిగి పెట్టుకోవాలి), టమోటాలు: రెండు (ముక్కలుగా చేసుకోవాలి), కరివేపాకు: కొద్దిగా, ఎండు కారం: అర టేబుల్‌ స్పూను, ధనియాల పొడి: టేబుల్‌ స్పూను, ఉప్పు: రుచికి సరిపడ, కొత్తిమీర: కొన్ని ఆకులు, నూనె: సరిపడ
మసాలా ముద్దకు: కొబ్బరి పొడి: రెండు స్పూన్లు, గసాలు: టేబఉల్‌ స్పూను. ఈ రెండు కలిపి కొద్దిగా నీరు కలిపి ముద్దగా చేసుకోవాలి.
తయారీ విధానం: బాండీలో నూనె పోసి కాగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరికొద్ది సేపు దోరగా వేయించుకోవాలి. దీనికి పసుపు, కారం, ఉప్పు జత చేసి వేయించుకోవాలి ఇప్పుడు టమోటా ముక్కలు వేసుకొని కొద్దిగా నీరు పోసి బాగా ఉడికించుకోవాలి. టమోటాలు బాగా ఉడికిన తరువాత బంగాళాదుంప ముక్కలు, కొబ్బరి ముద్ద వేసి మరికొద్ది సేపు ఉడికించి దించే ముందు కొత్తిమీర ఆకులు వేసుకొని దించేయాలి.

Updated Date - 2015-11-05T15:08:25+05:30 IST