ఓట్స్‌ చపాతీ

ABN , First Publish Date - 2015-10-21T14:57:28+05:30 IST

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి: కప్పు, ఓట్స్‌పొడి: కప్పు, నువ్వులు: రెండు టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిరపకాయలు

ఓట్స్‌ చపాతీ

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి: కప్పు, ఓట్స్‌పొడి: కప్పు, నువ్వులు: రెండు టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిరపకాయలు: నాలుగు లేక ఐదు(ముక్కలుగా చేసుకోవాలి), కొత్తిమీర: కొద్దిగా, ఉప్పు: రుచికి సరి పడ, నూనె: తగినంత.
తయారీవిధానం: గిన్నెలో గోధుమపిండి, ఓట్స్‌పొడి, పచ్చిమిరపకాయ ముక్కలు, నువ్వులు, ఉప్పు, కొత్తిమీర అన్నీ వేసి బాగా కలిపి చపాతీ పిండిలాగా మృదువుగా తడిపి పెట్టుకోవాలి. ఈ పిండి మీద తడిబట్ట వేసి గంట పాటు నాననివ్వాలి. అనంతరం చపాతీలుగా కావలసినంత మందంలో ఒత్తుకొని ఒకదాని తరువాత ఒకటి కాల్చుకోవాలి. చపాతీలు కాల్చేసమయంలో పెద్ద మంట కాకుండా సన్నని మంట మీద కాల్చుకోవాలి.

Updated Date - 2015-10-21T14:57:28+05:30 IST