లెమన్‌ ఓట్స్‌

ABN , First Publish Date - 2015-10-21T14:52:23+05:30 IST

కావలసిన పదార్థాలు: ఓట్స్‌: మూడు కప్పులు, నీళ్ళు: కప్పు, ఉప్పు: తగినంత, వేరుశనగపప్పు: రెండు

లెమన్‌ ఓట్స్‌

కావలసిన పదార్థాలు: ఓట్స్‌: మూడు కప్పులు, నీళ్ళు: కప్పు, ఉప్పు: తగినంత, వేరుశనగపప్పు: రెండు స్పూన్లు, నిమ్మరసం: రెండు స్పూన్తు, ఆవాలు: టేబుల్‌స్పూను, జీలకర్ర: టేబుల్‌ స్పూను, పచ్చిశనగపప్పు: రెండు స్పూన్లు, పచ్చిమిరపకాయలు: మూడు లేదా నాలుగు(తరిగి పెట్టుకోవాలి), కరివేపాకు: కొద్దిగా, ఇంగువ: చిటికెడు, నూనె: తగినంత
తయారీ విధానం: మందపాటి గిన్నె లేదా బాండీలో తగినంత నూనె వేసి కాగిన తరువాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి వేయించుకుని నీరు పోసి, ఉప్పు వేసి తెర్లనివ్వాలి. నీరు తెర్లుతున్న సమయంలో ఓట్స్‌ వేసి ఉడికించాలి. దించే ముందు నిమ్మరసం జతచేయాలి.

Updated Date - 2015-10-21T14:52:23+05:30 IST