గుమ్మడి కాయ పెరుగు పచ్చడి

ABN , First Publish Date - 2015-09-01T22:24:34+05:30 IST

కావలసిన పదార్థాలు: గుమ్మడి ముక్కలు - 150 గ్రా., పచ్చిమిర్చి - 2, ఉప్పు - రుచికి తగినంత, నీరు - 1 కప్పు

గుమ్మడి కాయ పెరుగు పచ్చడి

కావలసిన పదార్థాలు: గుమ్మడి ముక్కలు - 150 గ్రా., పచ్చిమిర్చి - 2, ఉప్పు - రుచికి తగినంత, నీరు - 1 కప్పు, గిలకొట్టిన పెరుగు - 1 కప్పు, నూనె - 2 టీ స్పూన్లు, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, ఎండుమిర్చి - 1.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో నీరు పోసి గుమ్మడి ముక్కలు, చీరిన పచ్చిమిర్చి, ఉప్పు వేసి మూతపెట్టి (ముక్కలు మరీ మెత్తబడకుండా) ఉడికించాలి. చల్లారిన తర్వాత పెరుగు కలపాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చితో పెట్టిన తాలింపు కలపాలి. ఈ పచ్చడి అన్నం, పరాటాలతో బాగుంటుంది. 

Updated Date - 2015-09-01T22:24:34+05:30 IST