బీరకాయ ఉల్లికారం

ABN , First Publish Date - 2015-09-18T17:20:49+05:30 IST

కావలసిన పదార్థాలు: ఉల్లికారం - 2 టీస్పూన్లు, బీరకాయలు - 4, కారం - 1 టీస్పూను,

బీరకాయ ఉల్లికారం

కావలసిన పదార్థాలు: ఉల్లికారం - 2 టీస్పూన్లు, బీరకాయలు - 4, కారం - 1 టీస్పూను, ఉప్పు - తగినంత, నూనె - 1 టేస్పూను
కొత్తిమీర - 1 కట్ట
తయారీ విధానం:
బీర కాయలు కడిగి మధ్యకు రెండు ముక్కలు చేయాలి. ఈ ముక్కల మీద లోతుగా గాట్లు పెట్టుకోవాలి
ఉల్లికారం, కారం, ఉప్పు కలుపుకోవాలి.
ఈ ముద్దను బీరకాయల్లో కూరి పక్కన పెట్టుకోవాలి.
బాండ్లీలో నూనె వేడిచేసి బీర కాయ ముక్కల్ని ఉంచి చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించాలి.
బీర కాయ ముక్కలు సమంగా ఉడికేలా ముక్కలను తిప్పుతూ ఉడకించాలి.
15 నిమిషాలాగి కూరను దింపి దానిపై తరిగిన కొత్తిమీరతో అలంకరించాలి.

Updated Date - 2015-09-18T17:20:49+05:30 IST